Magazines

ఏఐకేఎస్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

2 గంటల క్రితం

Poster Launch
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇంటికో మనిషి.. ఊరికో బండి.. నల్గొండకు తరలిరండి

- రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఈ నెల 15న నల్గొండలో జరగనున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల ప్రారంభ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని నందిపాడు పంచాయతీ కుడుములపాడులో మహాసభల ప్రచార వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇంటికో మనిషి.. ఊరికో బండి” చొప్పున రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో నల్గొండకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మడకం చంద్రం, మడకం నాగేశ్వరరావు, మడకం చిరంజీవి, ఈశ్వరయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్