Magazines

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: సిద్రాల శ్రీనివాస్

1 గంట క్రితం

All graduates
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - యాలాల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు అర్హులైన మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.


ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఇతర పట్టభద్రులకు సైతం ఓటరు నమోదుపై అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్