Magazines

ప్రచారం సరే...ప్రణాళిక ఏదీ.?

54 నిమిషాల క్రితం

The campaign
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

ఎల్నివో నేపథ్యంలో ఆరుతడి వంటలను సాగుచేయాలంటున్న అధికారులు

ఇప్పటికీ అందుబాటులోకి రాని విత్తనాలు

కరెంట్ సరఫరాపై స్పష్టత కరువు

అయోమయంలో రైతులు

నవతెలంగాణ-మల్హర్ రావు

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ అందుకు తగ్గట్టు ప్రణాళికను ప్రకటించక పోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతోపాటు కరెంట్ సరఫరాపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

స్పష్టత ఇవ్వకుంటే...అవగాహన సదస్సులు వృథానే

ప్రస్తుతం కాటారం డివిజన్లో మల్హర్, కాటారం, మహాదేవపూర్, మహముత్తారం, పలిమేల మండలాల్లోని ఆయా గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులకు అవగా హన సదస్సులు నిర్వహిస్తున్నారు. జొన్న, సజ్జ, నువ్వులు, ఆవాలు, కూరగాయలు, సన్ఫ్లవర్ వంటి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. కానీ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలనే విషయం మాత్రం ప్రస్తావించటం లేదు. అలాగే వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంట్ సరఫరా చేస్తారో ఇప్పటికీ ఒక స్పష్టత లేదు.


విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం, ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి ఇన్ని గంటలు కరెంట్ ఇస్తామని ఖచ్చితమైన ప్రకటన వచ్చేంత వరకు వ్యవసాయశాఖ అధికారులు ఎంత అవగాహన కల్పించినా వృథానే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణ చర్యగా వ్యవసాయ రంగానికి ఇన్ని గంటలు కరెంట్ ఇస్తామని స్పష్టం చేసి నప్పుడే తాము తమకు ఉన్న బోరుబావులకు అను గుణంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేసుకునే వీలు ఉంటుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెంట్ సరఫరాపై స్పష్టత ఇవ్వడంతోపాటు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

సబ్సిడీపై విత్తనాలు లేవు: శ్రీజ మండల వ్యవసాయాధికారి

రైతులు ఈ యాసంగిలో సాగు చేసుకోవాలనుకునే ఆరుతడి పంటలకు సంబంధించి సబ్సిడీపై లభించే ఎలాంటి విత్తనాలు మా వద్ద లేవు. ఈ విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళతాం. వస్తే రైతులకు తెలియజేస్తాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్