ఎమ్మెల్యేను కోరిన శాలివాహన కుమ్మరి సంఘ నాయకులు
- భగత్ సింగ్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసుకోండి
- ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంఘ నాయకులు
నవతెలంగాణ - సత్తుపల్లి
ప్రథమ తెలుగు కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ సత్తుపల్లి పట్టణ, మండల శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. విగ్రహ ఏర్పాటుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా స్థలం మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆనుకుని ఉన్న స్థలంలో మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కమ్యూనిటీ హాల్ స్థల కేటాయింపుపై సానుకూలంగా ఆలోచించి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. వినతిపత్రం ఇచ్చిన వెంటనే స్పందించి స్థలం కేటాయించిన ఎమ్మెల్యేకు శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ దండు రామారావు (సాయిరాం మెడికల్ ఏజెన్సీ), మండల కన్వీనర్ గుడిమెట్ల రామారావు, పట్టణ నాయకులు మల్లికంటి రాము (సుమాంజలి), ఏదులపరుపు వెంకటేశ్వరరావు, టిప్ టాప్ టైలర్ రాము, రామానగరం గ్రామ కమిటీ నాయకులు దండు జగన్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)