Magazines

అర్నాబ్ ప్రభావం.. అత్యధిక వర్షపాతం

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

- జిల్లా సగటు వర్షపాతం 14.6 మి.మీ.

- జిల్లాలో 66.5 మి.మీ. నమోదు.. 

Heavy Rainsనవతెలంగాణ - అశ్వారావుపేట

అర్నాబ్ అల్పపీడన ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు నమోదైన వర్షపాతంలో అశ్వారావుపేట మండలం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 66.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.


జిల్లావ్యాప్తంగా సగటున 14.6 మి.మీ. వర్షం కురవగా, అన్నపురడ్డిపల్లి మండలంలో 29.5, ములకలపల్లిలో 25.8, దమ్మపేటలో 25.6, చంద్రుగొండలో 24.0, బూర్గంపాడులో 21.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. చుంచుపల్లి, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో 16 నుంచి 19 మి.మీ. మధ్య వర్షం కురిసింది.


మరోవైపు కరకగూడెం, జూలూరుపాడు మండలాల్లో 2.3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదు కాగా, అల్లపల్లి మండలంలో చినుకు పడలేదు. జిల్లా మొత్తం మీద 336.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాలు వెల్లడించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్