Magazines

మిర్యాలలో బీఆర్ఎస్ నాయకునిపై దాడి

1 గంట క్రితం

Attack
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నూతనకల్
మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకునిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఎస్సై నాగరాజ్ తెలిపిన ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్నను తన ఇంటి ముందే అదే గ్రామానికి చెందిన మన్యం పరమేశ్ కొంతమందితో కలిసి వచ్చి బీర్ బాటిల్ తో దాడి చేశాడు. దీంతో వెంకన్న తలపై గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్