- మార్నింగ్ వాకర్స్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు మార్నింగ్ వాకర్స్‌ను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తక్కినపల్లి రవీందర్,అశ్వారావుపేట నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జి ఉప్పల వెంకటరమణ పట్టభద్రులతో మాట్లాడి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించారు.
2023 అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ప్రాంతంలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ జూపల్లి రమణారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సంక ప్రసాద్, మండల నాయకులు మందపాటి మోహన్‌రెడ్డి, రావు జోగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సాధు జ్యోత్స్నాభాయ్, ఉస్మాన్, రెహ్మాన్ ఉస్మాన్, బన్ను తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)