Magazines

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు

7 గంటల క్రితం

Belt Shops
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

గ్రామాల్లో రోజురోజుకు విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలుస్తున్నాయనీ, దీంతో యువత మద్యం మత్తులో తూలుతున్నారని 

పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీతా అన్నారు. పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రగతిశీలా మహిళా సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో యువత మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాష్ట్రంలో మహాలక్ష‍్మీ పథకం బాగుందనీ, మరోవైపు విచ్చలవిడి బెల్ట్ షాపులతో భర్తలు, అన్నదమ్ములు మహాలక్ష్మిలను తీరని దు:ఖంలోకి నెడుతున్నారని వాపోయారు.


మద్యానికి బానిసలై సామాన్యులు కుటుంబాలను కోల్పోతుంటే ప్రభుత్వం మాత్రం కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని విమర్శించారు. ఈ సమావేశంలో పీ ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ, పీ ఓ డబ్ల్యూ జిల్లా సీనియర్ నాయకురాలు సుంకె సుగుణ, మందనపల్లి ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ,జిల్లా పీ ఓ డబ్ల్యూ నాయకులు తమ్మడి మాదవి, కొంగరి ప్రమిల, తమ్మడి ఉమా,గడ్డం పద్మ, బేజాడి వినోద,కొమ్మిడి లత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్