Magazines

పంటలకు ఆర్నాబ్‌ తుఫాన్‌ ముప్పు

1 గంట క్రితం

Arnab Tuffan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

రైతుల్లో ఆర్నబ్ భయం పట్టుకుంది. బంగాళాఖాతంలో ఆర్నబ్ తుపాన్ ఏర్పఢీ బుధ, గురువారం మండలంలో చిరు జల్లులు కురువగా రైతులు ఆందోళనకు గురివుతున్నారు. మండలంలో వరి 14,500, పత్తి 3,600, మిర్చి 1,450 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం వరి పొలాలు ముమ్మరంగా కోతలు ప్రారంభించారు. పత్తిని ఎరుతున్నారు. మిర్చి మొక్కల దశలో ఉంది. అయితే తుపాన్ ప్రభావం ఏవిధంగా ఉంటుందోని ఆందోళన చెందుతున్నారు.

రైతు వెన్నులో వణుకు..

అక్టోబర్ చివరి రోజులంటే రైతు వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఆకాల వర్గాలు ముంచుతున్నాయి. ఈసారి ఎలినినో ప్రభావంతో ఈ సారి వరినాట్లు ఆలస్యంగా వేశారు. కొందరు జూన్లోనే వేశారు. అయినా వరి కోతలు అప్పుడే ప్రారంభమ య్యాయి. మరోవైపు అర్నబ్ తుపానుతో వాతావరణం చల్లబడింది. మేఘాలు కమ్ముకోవడం, చిరు జల్లులు కురవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతి కొచ్చే సమయంలో ప్రకృతి ఏ రూపంలో విరుచుకు పడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు..

ఏటా ఇవే తిప్పలు..

విత్తనం వేసినప్పటి నుంచి పంట విక్రయించే వర కూ రైతులకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి. పెట్టుబడులు పెరగడం, కూలీల కొరత, ఎరువులు, పురుగుమందుల ఖర్చులు భారంగా మారడం, ప్రకృతి వైపరీత్యాలు మరింత కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్లో కురిసే ఆకాలవర్షాలు రైతన్న పాలిట శాపంగా మారుతున్నాయి.

వెంటాడుతున్న వర్ష భయం

వరి కోతలు ప్రారంభం కావ డంతో రైతులు పంటను త్వరగా కోసి ధాన్యాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. వాతావరణంలో మార్పులు, తుపాను ప్రభావంతో వర్ష సూచనలు ఉండటంతో కోతలు చేపట్టాలా?.మరికొన్ని రోజులు వేచిచూడాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిపై పై వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోవడం, నేలకొరిగిన నష్టం వాటిల్లడం, నూర్పిడి, అరబెట్టడం వంటి పనులకు ఆటంకం కలుగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతు న్నారు. అక్టోబర్ చివరలో వాతావరణం కలవరపెడుతుండటంతో రైతన్న చూపంతా ప్రస్తుతం ఆకాశంపైనే ఉంది. ఈసారైనా ఆకాల వర్షాల ముప్పు తప్పి, పంటకు నష్టం వాటిల్లకుండా ప్రకృ తి సహకరించాలని రైతులు కోరుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్