తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బట్టు నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రక్తరాం తండా గ్రామానికి చెందిన గుగులోతు దస్రు నాయక్ మృతి చెందడం ఎంతో బాధాకరమని తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ తెలిపారు. గురువారం శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్, బొడ్లాడా గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న తో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి అయిన గుగులోతు దస్రు నాయక్ మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆయన సేవలు ఎన్నో ఉన్నాయని ఇలాంటి వ్యక్తి మృతి చెందడం ఈ ప్రాంతానికి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి ప్రకాష్ తో పటు కొంతమంది ఉన్నారు.






కామెంట్లు (0)