Magazines

ఆలేరు టౌన్‌లో ధర్మవిఠల్‌ 35వ వర్ధంతి

6 గంటల క్రితం

Dharmavithal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ధర్మ విఠల్ 35వ వర్ధంతి ఆలేరు పట్టణంలో శనివారం సిపిఐ ఎంఎల్ ఎన్డిఆర్, పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి చిత్రపటానికి పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కోలా అనిత పూలమాలవేసి నివాళులర్పించారు.


అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వస్పరి బాలమల్లేష్ మాట్లాడుతూ.. పీడిత, తాడిత ప్రజల పక్షాన రైతుకూలీ సంఘం నల్గొండ జిల్లా నాయకునిగా నిరంతరం పోరాటం చేసిన ఘనత విట్టల్ రెడ్డికి ఉందన్నారు.రై తాంగ ఉద్యమం చేస్తూనే భూస్వాముల వద్ద ఉన్న జీతగాల్లను కూడగట్టి సంఘం పెట్టి, పనికి తగ్గ వేతనం కోసం పోరాటాలు చేశాడని గుర్తు చేశారు.


 ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు పి సాయిలు,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు టీ శ్రవణ్,నాయకులు పి సునీల్,పివైఎల్ నాయకులు కే విక్రం పిఓడబ్ల్యూ నాయకులు కే స్వప్న,కే సునీత,పి జయమ్మ,కే విజయ, పార్టీ శ్రేణులు జె స్వామి,ఎం సత్తయ్య, కే రాజయ్య,ఎం గణేష్, లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్