40 కుర్చీలను అందించిన దాతలు గంగిశెట్టి ఉపేందర్ ధనలక్ష్మి దంపతులు
మరో దాదా కస్తూరి లక్ష్మయ్య అమృతమ్మ జ్ఞాపకార్ధంగా 20 కుర్చీలు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని శివపార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి దేవాలయంలోకి మొత్తం 52 కుర్చీలను దాతగా ఇద్దరు వచ్చి అందించడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు వేముల సుధాకర్ గుండా రాజేందర్ సామంతుల బుజ్జిబాబు తెలిపారు. బుధవారం కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి 40 కుర్చీలు అందించిన దాదా గంగిశెట్టి ఉపేందర్ ధనలక్ష్మి దంపతులు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. మరియు కస్తూరి లక్ష్మయ్య అమృతమ్మ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కస్తూరి రామకృష్ణ 20 కుర్చీలు ఇచ్చారు. వీరిని కమిటీ సభ్యులు అభినందించండి తెలిపారు. కార్యక్రమంలో మహిళా భక్తులు భేతు వరలక్ష్మి, వేముల మంజుల వెన్నాకుల రజిత, బానోతు రేవతి ,అండం శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)