నవతెలంగాణ - తొగుట
సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గాందరి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం (ఎన్ఎంఈఓ) కింద రైతులకు కె బీ ఎస్ హెచ్ - 85 రకం పొద్దుతిరుగుడు విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశారు.
అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించాలన్నారు. తక్కు వ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. నూనెగింజల పంటల సాగుతో రైతులు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్, విస్తరణ అధికారి నళిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)