Magazines

మద్యం తాగి వాహనం నడిపితే జైలే

56 నిమిషాల క్రితం

Driving under the influence of alcohol means a jail term.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎస్‌హెచ్‌వో సాయి కిశోర్ రెడ్డి

నవతెలంగాణ-అశ్వారావుపేట

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై అశ్వారావుపేట పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. గత 15 రోజుల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఐదుగురికి న్యాయస్థానం శిక్షలు విధించడం పోలీసుల పటిష్ట తనిఖీలకు నిదర్శనంగా నిలిచింది.

మద్యం సేవించి వాహనం నడపడం కేవలం వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదని, ప్రమాదం సంభవిస్తే వాహనం నడిపిన వ్యక్తితోపాటు అమాయకుల ప్రాణాలు, వారి కుటుంబాల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయని పోలీసులు హెచ్చరించారు. క్షణిక నిర్లక్ష్యం అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను అశ్వారావుపేట పోలీసులు దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన కోర్టు జడ్జి భవాని ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించగా, మరో ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో, ఎస్‌ఐ సాయి కిశోర్ రెడ్డి మాట్లాడుతూ అశ్వారావుపేట మండల ప్రజలు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్