- ట్రాఫిక్ సిఐ శంకరయ్య
నవతెలంగాణ- కడ్తాల్
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమనగల్లు ట్రాఫిక్ సిఐ శంకరయ్య అన్నారు. సోమవారం కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, సంబంధించిన పత్రాలు, కచ్చితంగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతివేగంగా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)