నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం కొయ్యుర్ పోలీస్ స్టేషన్ కాటారం డిఎస్పీ సూర్యనారాయణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను, స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిగతులను, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బంది తమ విధులను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్లు (0)