- ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ - అశ్వారావుపేట
రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన యాప్ ద్వారానే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని ఏడీఏ రవి కుమార్ డీలర్లను ఆదేశించారు.
ధరల పట్టికలను ప్రదర్శించటంతో పాటు నిల్వల వివరాలు ప్రకటించాలని చెప్పారు. మండలంలోని ఆసుపాక, కొత్త మామిళ్ళవారిగూడెం, ఆశ్వారావుపేటలో ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు.ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. ఆయన వెంట ఏవో శ్రీనివాసరావు, ఏఈవోలు ఉన్నారు.







కామెంట్‌లు (0)