నవతెలంగాణ-టేకుమట్ల
మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన దాసారపు రాజేష్(చిన్ని) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం దశ దినకర్మకు హాజరై బాధిత కుటుంబానికి రూ.26 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ..ఎల్లవేళలా అండగా ఉంటామని మృతుడి తల్లికి భరోసానిచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.




కామెంట్లు (0)