Magazines

ప్రభుత్వ జూ. కళాశాలలో మాక్ అసెంబ్లీ

17 నిమిషాల క్రితం

Mock Assembly
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థులే స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత మరియు శాసనసభ్యుల పాత్రలను అత్యంత సహజంగా పోషించారు. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు వాడీవేడీగా సాగింది.


నియోజకవర్గ సమస్యలు, ప్రభుత్వ విద్య, వైద్య రంగాల బలోపేతం, రైతు సంక్షేమం, రహదారుల అభివృద్ధి తదితర ప్రజా సమస్యలపై ప్రతిపక్ష విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం మంత్రులు ధీటుగా సమాధానాలు ఇచ్చింది. మధ్యమధ్యలో ఇరు పక్షాల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, స్పీకర్ సభను నియంత్రించిన తీరు అసలు శాసనసభ సమావేశాలను తలపించింది.


ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానమే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించింది.


ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సీఎం పాత్రను చందు, స్పీకర్గా, శిల్ప ,ప్రతిపక్ష హోదా పాత్రను సుహానా, విద్యాశాఖ మంత్రిగా అనూష ,ఎమ్మెల్యేలుగా శ్వేత ,కృష్ణవేణి ,అనూష, రాజేందర్ గౌడ్ , తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో అధ్యాపకుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్