Magazines

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...

4 గంటల క్రితం

Fire breaks out at Gandhi Hospital in Secunderabad on Tuesday
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

తప్పిన పెను ముప్పు
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని అకౌంట్స్ విభాగం లోని ఆఫీసు సూపరింటెండెంట్‌ (ఓఎస్) గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గది అంతటా వ్యాపించడం, పొగ దట్టంగా కమ్ముకోవడంతో అక్కడే విధుల్లో ఉన్న సుధీర్ అనే సెక్యూరిటీ సూపర్వై జర్  అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను అత్యవసర విభాగానికి (ఎమర్జెన్సీ వార్డుకు) తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించడంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆఫీస్ సూపరింటెండెంట్ రూంలో దేవుడి ఫోటో దగ్గర పెట్టిన దీపం కిందపడిన కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తు న్నారు. వెంటనే చర్యలు చేపట్టడంతో సమీప వార్డులకు ప్రమాదం విస్తరించకుండా పెను ముప్పు తప్పిందని ఆస్పత్రి వర్గాలు, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్