Magazines

మెస్ బాబుకు మాజీ ఎమ్మెల్యే సండ్ర నివాళి

1 గంట క్రితం

tribute
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస టాకీస్ రోడ్డులో నివాసముంటున్న మొరవనేని సత్యంబాబు (మెస్ బాబు) గురువారం గుండెపోటుకు గురై శివైక్యం చెందారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మృతుడి నివాసానికి వెళ్లిన ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


మిస్ బాబు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సండ్రతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, అమరవరపు కృష్ణారావు పాల్గొని మెస్ బాబుకు నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్