Magazines

బాల్యమిత్రుడి కుటుంబానికి స్నేహితుల ఆపన్నహస్తం

1 గంట క్రితం

friend's family
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సాయం

నవతెలంగాణ-నెల్లికుదురు
స్నేహమంటే సంతోషాల్లో తోడుండటమే కాదు.. కష్టకాలంలో అండగా నిలవడమే నిజమైన స్నేహం. అంటూ చిన్ననాటి స్నేహితుడు కాచికల్ గ్రామ నీకి చెందిన చిలక రవి అకారణ మరణం చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి బుధవారం స్నేహితులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు స్నేహితుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకుతోట సతీష్ మల్యాల అశోక్ మధు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బాల్యమిత్రుడు చిలుక రవి అకాల మరణం చందగా ఆ కుటుంబం విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి తోటి స్నేహితులందరూ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.


స్నేహితులందరూ కలిసి ఆర్థిక సహాయాన్ని సమీకరించి, రవి  కుమార్తె భవిష్యత్తుకు భరోసాగా ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. మా మిత్రుడు మాతో లేకపోయినా.. ఆయన కుమార్తె మా అందరి బిడ్డ. ఆ కుటుంబానికి మేమంతా జీవితాంతం అండగా ఉంటాం” అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క స్నేహితుడికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. స్నేహితుడు దూరమైనా.. స్నేహబంధం చెరిగిపోదు. నిజమైన స్నేహం మాటల్లో కాదు.. చేతల్లో కనిపిస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్