Magazines

ఆపదలో విద్యార్థికి అండగా నిలిచిన గచ్చిబౌలి పోలీసులు

2 గంటల క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితంగా కాపాడారు. అనంతరం అతడికి అవసరమైన మానసిక సహాయం అందేలా యూనివర్సిటీ వెల్ఫేర్ టీమ్‌కు అప్పగించారు. నవంబర్ 27న ఓ విద్యార్థి ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నట్లు అతని స్నేహితుడు డయల్-100కు సమాచారం అందించాడు. దీంతో గచ్చిబౌలి పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఎల్ మెన్ హాస్టల్‌కు చేరుకుని, అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థిని సురక్షితంగా కాపాడారు.


అనంతరం విద్యార్థి పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు అతడిని యూనివర్సిటీ వెల్ఫేర్ టీమ్‌కు అప్పగించారు. అతడికి మానసిక కౌన్సెలింగ్ అందించడంతో పాటు, తదుపరి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో స్పందించి అండగా నిలవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. స్నేహితుడి ఆందోళన, పోలీసుల సమయస్ఫూర్తి కలిసి యువ విద్యార్థికి సహాయం అందేలా చేశాయి. గచ్చిబౌలి పోలీసుల మానవత్వం, విధి నిర్వహణ పట్ల నిబద్ధత ప్రశంసనీయంగా నిలిచాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్