తొర్రూర్ ఆర్డీవో గణేష్
నవతెలంగాణ-నెల్లికుదురు
భూభారతి రీసర్వేలో భాగంగా రామాంజపురం లో రీ సర్వే చేసిన భూముల కొలతల వివరాలు తెలుపుట పై గురువారం గ్రామసభ నిర్వహించినట్లు తొరూరు ఆర్డీవో గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాంజపురం గ్రామంలో రైతులకు సంబంధించిన భూములపై రీ సర్వే చేశామని అన్నారు వాటి వివరాలు వెలిచుటకై ఈరోజు గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో గ్రామంలో ఉన్న రైతులకు నోటీసు చేస్తున్నామని వాటిపై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే 60 రోజులలోపు మా దృష్టి తీసుకువస్తే వాటి పరిష్కరిస్తామని అన్నారు. . ఈ కార్యక్రమంలో , తహసీల్దార్ చందా నరేష్ , డిఐ సురేందర్ , ఆర్ఐ రామకృష్ణ , జీపీఓ మధు సూడాన్ గ్రామ వార్డు మెంబెర్ శీలం శ్రావణి రైతులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.







కామెంట్‌లు (0)