Magazines

బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి

1 గంట క్రితం

MLA Bandari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.


ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, నియోజకవర్గ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన అంశాలపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సన్నాహాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్