- మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి
నవతెలంగాణ - తొగుట
నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరు కు విజయ్ (అమర్) రెడ్డి సూచించారు. గురువా రం తొగుట మండల కేంద్రంలోని రైతు వేదికలో యాసంగి పంటల సాగు ప్రణాళిక, ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై ఎదుర య్యే ఇబ్బందులు, పత్తి మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన వ్యవసాయ, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన కల్పించారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు యాసంగి పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్య క్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఏడీఏ మల్ల య్య, మండల వ్యవసాయ అధికారి మోహన్, సీసీఐ ఇన్చార్జి దాసరి సునీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భిక్షపతి, బుచ్చగౌడ్, నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి స్వామి, వివిధ గ్రామాల ఏఈఓలు, నాయకులు మల్లారెడ్డి, మార్కెట్ సిబ్బంది సునీల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)