Magazines

వ్యాపార సముదాయాల కేటాయింపులు పారదర్శకంగా జరగాలి

1 గంట క్రితం

Allotments
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయాల కేటాయింపులు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని మద్నూర్ వ్యాపార వర్తక సంఘ సభ్యులు గురువారం కార్యదర్శి సందీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేనూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీలో వ్యాపార సముదాయాల నిర్మాణం ఎంతో సంతోషకరమైనదనీ, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరమన్నారు.


అర్హులైన వారికి ఈ సముదాయాలను అందించాలనీ, ఇందులో ఎలాంటి రాజకీయ రికమండేషన్లకు, ఒత్తిళ్లకు తావివ్వొద్దని కోరారు. షెడ్లు తీసుకుని అద్దెకిచ్చేవారికి వీటిని కేటాయించొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి రచ్చ కుశాల్, వైస్ ప్రెసిడెంట్ ఉడుత వార్ సురేష్, కార్యదర్శి నాగనాథ్ ,ఇతరులు విట్టల్, శ్రీధర్, మారుతి, అబ్భూ, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్