నవతెలంగాణ-మద్నూర్
ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో రావాల్సిన నీటి ఎద్దడి శీతాకాలంలోనే తీవ్రమవుతోంది. బోరుబావులు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా నీటికి అష్టకష్టాలు పడే పరిస్థితులు దాపురించాయి. మండల పరిధిలోని చిన్నఎక్లారాలో ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే స్పందించిన సర్పంచ్ మాధవరావు ప్రజల సౌకర్యార్ధం ట్యాంకర్ల ద్వారా వార్డుల వారీగా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని వృధా చేయొద్దని, పొదుపుగా వాడుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఇప్పటి నుంచే ఇలా ఉంటే మళ్ళీ వచ్చే వానాకలం వరకు నీటికోసం ఎన్ని గోసలు పడాలో అని సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)