నవతెలంగాణ – కాప్రా
అనారోగ్యంతో మృతి చెందిన కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. పెంటయ్య కుటుంబానికి తోటి పోలీసు సిబ్బంది, బ్యాచ్‌మేట్స్ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మొత్తం రూ.2,83,500 నగదును మృతుని భార్య బి. రాజమణికి అందజేశారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లోని శివాజీనగర్, బాలాజీనగర్‌కు చెందిన బి. పెంటయ్య (50) 2022 ఆగస్టు 15 నుంచి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 31, 2026న ఉదయం సుమారు 7 గంటలకు అనారోగ్య సమస్యలతో తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఏఎస్ రావు నగర్‌లోని జెమ్కేర్ పౌలమి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పెంటయ్య కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రూ.1,14,500, ఆయన బ్యాచ్‌మేట్స్ రూ.1,69,000 సమిష్టిగా సేకరించారు.
ఈ మొత్తాన్ని కలిపి రూ.2,83,500 నగదును మృతుని భార్య రాజమణికి వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్పెక్టర్లు చి. నరేందర్ రావు, జి. మల్లేష్, లింగారెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది, పెంటయ్య బ్యాచ్‌మేట్స్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, మృతునికి సంబంధించి కుటుంబానికి రావాల్సిన సర్వీస్ పరమైన, ఇతర అర్హత కలిగిన ప్రయోజనాలు త్వరగా అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.





కామెంట్లు (0)