నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలో గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న 174వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ.. పేదల హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జింకల లింగస్వామి ముదిరాజ్, డెంకాని జానయ్య ముదిరాజ్, కుక్కల వెంకటేష్ ముదిరాజ్, జింకల రమేష్ ముదిరాజ్, కుక్కల మహేందర్ ముదిరాజ్, డెంకని రవి ముదిరాజ్, జింకల కృష్ణ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)