పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
నవతెలంగాణ-కుభీర్
ముధోల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతిలో అర్హులైన పేద మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని ముధోల్ పవర్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన కుబీర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన చేయత పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నిర్మల్ జిల్లాలో 8వేల 800 పెన్షన్లు రాగా ముధోల్ నియోజకవర్గం లో 47% పెన్షన్లను మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కుబీర్ మండల మండలంలో 778 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 639 మందికి పెన్షన్లు మంజూరు కావడం జరిగిందన్నారు. దింతో గ్రామలోఉన్న ప్రజలు వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
వాటిని కూడా త్వరలో పూర్తి చేసి ఆరులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేసేలా కృషి చేష్టమన్నారు. దింతో పాటు గ్రామమలో ఉన్న మౌలిక రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్ఠుకి తీసుకువెళ్ళు ప్రభుత్వానికి కుభీర్ మండలాన్ని కరువు మండలాన్ని ప్రకటించిన ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రజలకు ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ భూమరావు ఎంపీఓ బీమేష్, సర్పంచులు మారుతీ సాయినాథ్, ఆత్మ కమిటీ చర్మన్ వివేకానంద,ఆయా గ్రామాల ప్రకజలకు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.







కామెంట్లు (0)