Magazines

గుడి నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ దందా

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

ఖమ్మం, హైదరాబాద్ కు తరలింపు
గ్రామంలో నిర్మించే దేవాలయానికి ఆరు లక్షలు చెల్లించాలని తీర్మానం
నవతెలంగాణ-నూతనకల్
మన ఊరు, మన ఇసుక ,మన ఇష్టానుసారం తోలుకునే హక్కు మన గ్రామ ప్రజలకే ఉన్నది. చట్టం, ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదు. మన గ్రామ అభివృద్ధిలో భాగంగా గుడి నిర్మాణం కోసం ఆరు లక్షలు చెల్లించాలని  గ్రామ సర్పంచ్ ,గ్రామ పెద్దమనుషుల సమక్షంలో ఒప్పంద పత్రంను గురువారం  మండల పరిధిలోని మాచినపెళ్లి గ్రామ ప్రజలు రాసుకున్నార. గుడి నిర్మాణం పేరుతో అక్రమంగా ఇసుక ను తరలిస్తూ హైదరాబాద్, ఖమ్మం అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఆరు లక్షలు ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారం. ఈ ఆరు లక్షలు బయానగా లక్ష రూపాయలు ఈరోజు సర్పంచ్, గ్రామ పెద్ద మనుషులకు చెల్లించారు.. మిగతావి జనవరి నెలలో మూడు లక్షలు ఉగాదికి మరో రెండు లక్షల రూపాయలు చెల్లించే ఖారారుగా రాసుకున్నారు.


గుడి నిర్మాణానికి 200 ట్రక్కుల ఇసుక ఉచితంగా తోలాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు, అధికారులు ట్రాక్టర్ ను పట్టుకుంటే, ట్రాక్టర్ యజమాని సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పందంలో తెలిపారు. ఒప్పందంలో లేని ట్రాక్టర్ తో వాగులోకి దిగితే రూ. 20వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ఈ గ్రామంలో ఎటువంటి రీచ్ కానీ అనుమతులు కానీ లేవు కేవలం అక్రమంగా మాత్రమే తరలిస్తున్నారు.


ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు: తాసిల్దార్ శ్రీనివాసరావు
మాచినపెళ్లిలో గుడి నిర్మాణం పేరుతో గ్రామ పెద్దలు అక్రమంగా ఇసుకను తరలించాలని రాసుకున్న ఒప్పందం విషయం తనకు తెలిసిందని, వారిని బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించే ప్రయత్నం చేస్తే చట్ట రిత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్