హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘కల్ట్’. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల నిర్మించారు. ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలోని కలవరపరిచే ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ఇండియాలోనే తొలి ఒరిజినల్ స్లాషర్ థ్రిల్లర్. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘రిలీజ్ ట్రైలర్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. సెకండాఫ్‌లో 45 నిమిషాలు అడ్రినలిన్ హై ఇస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన తారక్ సినిమాస్‌కు థాంక్యూ. ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో కొంచెం సౌండ్ పెంచమని అడగండి. సున్నిత మనస్కులు, చిన్నపిల్లలు ఈ సినిమాకు కొంచెం దూరంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా వైల్డ్ సినిమా ఇది. ఈ సినిమా 49 శాతం క్రెడిట్ నేను తీసుకుంటాను. 51 శాతం క్రెడిట్ రవి బస్రూర్కి ఇస్తాను. తారక్ మ్యాడ్నెస్ ఉండే క్యారెక్టర్ చేశాడు’ అని చెప్పారు.







కామెంట్లు (0)