Magazines

జోరుగా ఇసుక అక్రమ రవాణా

3 గంటల క్రితం

Illegal sand
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

మానేరు నుంచి యథేచ్ఛగా తరలింపు

చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని తాడిచెర్ల, వల్లెంకుంట, మల్లారం తదితర గ్రామాల్లోని మానేరు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. రాత్రిపూట అక్రమంగా రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు అనుమతి లేకుండా మానేరు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. డోజర్ల సాయంతో ట్రాక్టర్ ఇసుక రూ.2వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుడండంతో మానేరులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. భూపాలపల్లి, ఖాసింపల్లి, కాటారం, జంగెడు, గంగారం తదితర ప్రాంతాలకు సైతం వ్యాపారులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక చేర వేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులకు సైతం ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వ్యాపారులు మాత్రం ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. దీంతో పిల్టర్లు, బోరుబావులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.


కళ్లముందే తరలిస్తున్నా..

ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా కళ్ల ముందు నుంచే ట్రాక్టర్లలో తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా అధికారులను ప్రశ్నిస్తే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, తమ దృష్టికి రానప్పుడు ఏం చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్