Magazines

విదేశీ పర్యటన ముగించుకుని మున్సిపల్ పనుల పరిశీలన

1 గంట క్రితం

Inspection
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

- 14, 15వ వార్డుల్లో అభివృద్ధి పనుల తనిఖీ

- నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచన

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు దంపతులు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 14, 15వ వార్డుల్లో నిర్మిస్తున్న సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల పనులను వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత ఇంజినీర్లకు సూచించారు. పనులను నిబంధనల ప్రకారం చేపట్టి, నాణ్యతతో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్