Magazines

భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పూజలు

1 గంట క్రితం

Kartik month
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కార్తీకమాసం అర్ధనారీశ్వరుడికి భక్తులు పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మున్ననూర్ మాజీ ఉపసర్పంచి భూదేవి వెంకటయ్య దంపతులు కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి శివ కేశవులకు ప్రదోషకాల సమయంలో ఆకాశ దీపోత్సవానికి షోడశోప ఉపచార పూజలు నిర్వహించి కర్పూర మంగళ నీరాజనములు సమర్పించి, ధ్వజారోహణం నిర్వహించారు.


అదేవిధంగా స్వామి వారికి ఆకాశ దీప పూజా కైంకర్యములతో పాటు తీర్థ ప్రసాదములు స్వీకరించి, స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మిడ్జిల్ మండలం, పాలమూరు జిల్లా ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, కోరుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్