Magazines

సీఎం చేతుల మీదుగా రేపు కేజీబీవీ భవనం ప్రారంభం

13 గంటల క్రితం

KGBV building
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–రాయపోల్

మండల కేంద్రంలో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని, అదనపు తరగతి గదులు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటలో తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గత కొన్నేళ్లుగా తాత్కాలిక భవనంలో విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినుల సమస్యలకు పరిష్కారం లభించనుంది. కొత్తగా ఏర్పడిన రాయపోల్ మండల కేంద్రంలో సుమారు మూడేండ్ల క్రితం అప్పటి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరుల చొరవతో రూ.3.50 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టారు.


నిర్మాణ పనులు పూర్తికావడంతో విశాలమైన తరగతి గదులు, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక తరగతి గదులు, ప్రహరీ గోడతో పాటు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కలగనుంది.

అదనపు గదులకు రూ.3.11 కోట్లు

ఇదిలా ఉండగా, పాఠశాల సమీపంలో అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ.3.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆర్‌వీఎం డీఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో హర్షం: యేండ్ల తరబడి తాత్కాలిక భవనాల్లో చదువుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థినులకు సొంత భవనం అందుబాటులోకి రావడం పట్ల విద్యార్థినులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్