Magazines

హెల్ప్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

1 గంట క్రితం

police
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

ఎస్‌హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి

నవతెలంగాణ - అశ్వారావుపేట

ప్రభుత్వం అందిస్తున్న హెల్ప్‌లైన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అశ్వారావుపేట ఎస్‌హెచ్ఓ బోగ్గుల సాయి కిశోర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని రామన్నగూడెంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చిన్నారులపై వేధింపులను గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పోలీసు సహాయం కోసం 100, 112 నంబర్లను, సైబర్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదు చేసేందుకు 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని వివరించారు.


యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడకం నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్