నవతెలంగాణ-మద్నూర్
పశుసంవర్ధక శాఖ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పశువులకు ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసే వాటిని పశువుల దారులు సద్వినియోగం చేసుకోవాలని లింబూర్ గ్రామ సర్పంచ్ సుజాత శివారెడ్డి తెలిపారు. బుధవారం నాడు లింబూరు గ్రామంలో పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ సుజాత ప్రారంభించారు. పశువులకు పశు వైద్యులు డాక్టర్ వినీత్ కుమార్ చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు పశువైద్య సిబ్బంది పశువుల దారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)