నవతెలంగాణ–మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం విగ్రహాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ వాడల్లో కొలువుదీరిన దుర్గామాత విగ్రహాలను గాంధీ చౌక్, పాత బస్టాండ్, పోలీస్ స్టేషన్, సంతోష్ మాత, రతన్ గల్లి, దళితవాడ తదితర ప్రాంతాల మీదుగా ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా వాడవాడలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో భక్తులు, చిన్నారులు, పెద్దలు భాజాభజంత్రీల నడుమ శోభాయాత్రలో పాల్గొని సందడి చేశారు.





కామెంట్లు (0)