Magazines

డ్రైనేజీ సమస్యలపై స్పందించిన అధికారులు

1 గంట క్రితం

Officials respond
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం

నాచారం సర్కిల్ పరిధిలో అశోక్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు స్పందించారు. అశోక్ నగర్ మెయిన్ రోడ్డులో డ్రైనేజీ పైప్‌లైన్ దెబ్బతినడంతో పాటు, నసీబ్ చికెన్ షాప్ నుంచి బస్తీ బొడ్రాయి వరకు ఉన్న పైప్‌లైన్‌ను మార్చాల్సిన అవసరం ఉందని స్థానికులు పలుమార్లు సమస్యను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలి శ్రీనివాస్ రెడ్డి, విక్టరీ జోష్, బాలకృష్ణ, సీపీఐ నాయకులు నర్సింగరావు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఏఈ రోహిత్ శుక్రవారం సమస్యాత్మక ప్రాంతాన్ని సందర్శించి దెబ్బతిన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ను పరిశీలించారు.


పైప్‌లైన్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన ఏఈ రోహిత్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్