Magazines

బాల్కొండలో పోలీసుల కార్డెన్ సెర్చ్

08 అక్టోబర్, 2026

cordon search
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

ఇంటింటి తనిఖీలు.. పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు

నవతెలంగాణ-బాల్కొండ 

బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు బృందాలు ఇంటింటికీ తిరుగుతూ ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ జాన్‌రెడ్డితో పాటు బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఆర్మూర్ ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్