డిసెంబర్ 1, 2 తేదీల్లో వలిగొండలో నిర్వహణ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
యువ కమ్యూనిస్టులకు రాజకీయ అవగాహన, సిద్ధాంతపరమైన స్పష్టత కల్పించేందుకు డిసెంబర్ 1, 2 తేదీల్లో వలిగొండలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కవిడే సురేష్, బుర్రు అనిల్ కుమార్ తెలిపారు.
ఈ శిక్షణ తరగతులకు డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే తరగతుల్లో పాల్గొనేందుకు సభ్యులంతా ముందుగానే సిద్ధమై డిసెంబర్ 1వ తేదీన వలిగొండకు చేరుకోవాలని కోరారు. యువతలో రాజకీయ చైతన్యం, సామాజిక అవగాహన పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.







కామెంట్లు (0)