- టీజీఎస్పీ డీఐజీ మురళీకృష్ణ
- గంగారం ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సందర్శన
నవతెలంగాణ-సత్తుపల్లి
పోలీసు శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అన్ని విభాగాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలని తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఐజీ పి. మురళీకృష్ణ అన్నారు. వార్షిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ గిరిజన బెటాలియన్ ను డీఐజీ మురళీకృష్ణ బుధవారం సందర్శించారు. బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్దబాబు, అడిషనల్ కమాండెంట్ ఎం. అంజయ్య డీఐజీ మురళీకృష్ణను సాదరంగా ఆహ్వానించారు.
సహాయ దళాధిపతులు బి. వేణుగోపాలరెడ్డి, బి. వినాయకరావు డీఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు.
వివిధ విభాగాలు, రికార్డుల పరిశీలన వివిధ విభాగాలు, రికార్డుల పరిశీలనను డీఐజీ మురళీకృష్ణ చేపట్టారు.
అనంతరం డీఐజీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలోని పరిపాలనా విభాగాన్ని, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డుల నిర్వహణ, వాహనాల స్థితిగతులు, వివిధ విభాగాల పనితీరును స్వయంగా పరిశీలించారు.
సిబ్బంది విధి నిర్వహణ తీరుపై, రికార్డుల భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
బెటాలియన్‌లోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తూ క్రమశిక్షణ, అంకితభావం కనబరచాలని డీఐజీ మురళీకృష్ణ ఆదేశించారు. పోలీసు శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రతీ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా నిరంతరం కృషి చేయాలని అధికారులకు సూచించారు.







కామెంట్‌లు (0)