నవతెలంగాణ - తొగుట
ప్రజావాణికి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ పి. వి. నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఒక దరఖాస్తు అందినట్లు తెలిపారు. ఈ సంద ర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు ఏవైన ప్రభుత్వ సంక్షేమ పథకాల సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ సమీర్ హమ్మద్ ఖాన్, ఎంఈఓ నర్సయ్య, ఎంపీవో నర్సింహారెడ్డి, ఏపీఎం బాబు,, అంగన్వాడీ సూపర్వేజర్ శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.






కామెంట్లు (0)