Magazines

నిధుల మంజూరుపై మంత్రి శ్రీధర్ బాబుకు సర్పంచ్ కృతజ్ఞతలు

8 గంటల క్రితం

granting funds
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామపంచాయతీకి, కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యారు. అదేవిధంగా అలాగే గ్రామంలోని రెండు అంగన్వాడి భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షల చొప్పున రూ.24 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు గ్రామ ప్రజల తరుపున గ్రామ సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్