Magazines

ప్రతాపసింగారం, చర్లపల్లి పాఠశాలల్లో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

7 గంటల క్రితం

students

students

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం: పిల్లలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు రూపొందించిన పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రియాంక ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే విధానాలు, వేధింపులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.


ఈ కార్యక్రమంలో 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రతాపసింగారంలోని బాలసదన్‌ను సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అదేవిధంగా మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజు లాడే చర్లపల్లిలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాలలు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు, తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మరో 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో న్యాయమూర్తులతో పాటు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, కోర్టు సిబ్బంది, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలల హక్కులు, భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్