Magazines

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

4 రోజుల క్రితం

best results
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

నవతెలంగాణ-వర్ధన్నపేట

విద్యార్థులు పట్టుదలతో పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. శుక్రవారం వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న సెమిస్టర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు క్రమశిక్షణతో, చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి - రాజేందర్, కళాశాల ప్రిన్సిపాల్ పోషయ్య, వార్డు కౌన్సిలర్స్ మాలోతు దేవేందర్, తిరుపెల్లి వాణి - కుమారస్వామీ, కళాశాల టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్