జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ - మిడ్జిల్
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులు పనిచేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బోయిన్పల్లి సర్పంచ్ శశికళ రెడ్డి స్వగృహంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్, వేముల వల్లూరు నాగరాజు యాదవ్ కు, మండల కార్యదర్శిగా వాడియాల బొర్రా శివకుమార్ కు నియామక పత్రాలను పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాలలో అవినీతి లేకుండా అర్హులకు అందిస్తున్నది ప్రజా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అనంతరం మండల కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, సాయిలు, విజయ్ కుమార్, బాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి , సాయిలు, నరసింహులు, కొత్తపల్లి తిరుపతి, బంగారు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)