నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని టీజీ ఆర్ఎస్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ (9, 10 తరగతులు), సంస్కృతం (ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు) బోధించడానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
అర్హతలు:
ఇంగ్లీష్: M.A. English + B.Ed, సంస్కృతం: M.A. Sanskrit + B.Ed డెమో నిర్వహించిన అనంతరం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలతో పాఠశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 05-11-2026.





కామెంట్లు (0)